Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం

ఆరుగురు భారతీయులు సహా 18మంది మృతి
మెక్సికో: మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలోకి దూసుకెళ్లి ఆరుగురు భారతీయులు సహా 18మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన నయారిట్‌ రాష్ట్రంలో జరిగింది. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉండగా 23మందికి గాయాలయ్యాయని నయారిట్‌ భద్రత, పౌర సంరక్షణ కార్యదర్శి జార్జ్‌ బెనిటో రోడ్రిగ్స్‌ వెల్లడిరచారు. అమెరికా సరిహద్దులోని టిజ్వానాకు వెళ్లే క్రమంలో బస్సు ప్రమాదానికి గురైందని, టెపిక్‌ బైపాస్‌ గుండా 50మీటర్ల లోతైన లోయలోకి పడిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. చనిపోయిన వారిలో భారతీయులు, డొమెనిక్‌ రిపబ్లిక్‌, ఆఫ్రికాకు చెందిన వారున్నట్లు అధికారులు తెలిపారు. అనుకూల పరిస్థితులు లేకపోవడంతో సహాయక చర్యలు కష్టమైనట్లు రోడ్రిగ్స్‌ చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెక్సికన్‌ రెడ్‌క్రాస్‌తో పాటు ఇతర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు వెల్లడిరచారు. మృతదేహాల వెలికితీత, గుర్తింపునకు సమస్యలు వచ్చాయన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు. మలుపులు ఎక్కువగా ఉండటానికి తోడు అతివేగం కారణంగా ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. లోతైన దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడిరచారు. ఇలావుంటే, గత నెలలో ఓక్సాకాలో జరిగిన బస్సు ప్రమాదంలో 29మంది చనిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img