Monday, September 25, 2023
Monday, September 25, 2023

తేరుకోని లిబియా భీతావహంగా డెర్నా నగరం

తుపాను సృష్టించిన మహా విలయంలో 20వేల మంది మృతి
డెర్నా: డేనియల్‌ తుపాను మిగిల్చిన విషాదం నుంచి లిబియా ఇంకా తేరుకోలేదు. వేలాది మంది ప్రాణాలు కోల్పో యిన డెర్నా నగరంలో పరిస్థితి కుదుటపడలేదు. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డెర్నాలో కేవలం ఒక్కే ఒక్క రాకాసి అల… 20 వేల మంది ప్రాణాలను బలిగొందని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ నిపుణులు వెల్లడిరచారు. ఈ అల ఎత్తు దాదాపు 7 మీటర్లు ఉందని తెలిపారు. పల్లపు ప్రాంతాల్లో ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం అంత ఎత్తుకు చేరుకొందని… అందువల్లే మరణాల సంఖ్య భారీగా ఉందని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ నిపుణులు వివరించారు. అత్యం త వేగంతో దూసుకొచ్చిన బురద నీరు… భారీ భవనాలను కుప్పకూల్చి… ప్రజలను ఈడ్చుకొని సముద్రంలోకి తీసుకెళ్లిపోయిం దని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడి సముద్ర తీరంలో తేలియాడుతున్న మృతదేహాలు స్థానికులకు కనిపిస్తూనే ఉండడం డెర్నాలో దుస్థితికి అద్దం పడుతోంది. డెర్నాలో వేలాది మంది జాడ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. వరద ఉధృతికి ఇళ్లు సహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేల సంఖ్యలో ఉన్నారని వెల్లడిరచారు. సహాయక చర్యలు ప్రారంభించిన బృందాలకు ఎక్కడ చూసినా కుళ్లినళ్లి స్థితిలో మానవ మృతదేహాలు కనిపిస్తున్నాయి. కనీస వసతులు కూడా లేని డెర్నాలోని ఆస్పత్రులు మృతదేహాలకు నిలయాలుగా మారాయి. మృతుల సంఖ్య 20 వేలకు పైనే ఉంటుందని డెర్నా మేయర్‌ అబ్దుల్‌ మునీమ్‌-అల్‌-ఘైతీ చెప్పారు. ఇప్పటికే వేల సంఖ్యలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డెర్నా నగరంలో తుపాను తర్వాత పరిస్థితు లు… నాటి విధ్వం సానికి గుర్తులుగా మారాయి. పదుల సంఖ్యలో కార్లు, వాహనాలు కొట్టుకువచ్చి ఒక దగ్గర్గ చెల్లాచెదురుగా పడిపోయాయి. కూలిపోయిన భవనాలు…నేలకూలిన భారీ వృక్షాలు… వరదల్లో సర్వస్వం కోల్పో యిన బాధితుల రోదనలో.. డెర్నా భీతావాహంగా మారింది. డెర్నాలో డేనియల్‌ తుపాను విధ్వంసంలో కుటుంబాలకు కుటుంబాలే గల్లంతయ్యాయని అధికారులు తెలిపారు. ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని ఐక్యరాజ్యసమితి వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img