Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

న్యూయార్క్‌లో దీపావళికి సెలవు

మేయర్‌ ఆడమ్స్‌ ప్రకటన – బిల్లుకు సెనేట్‌ ఆమోదం

న్యూయార్క్‌: వెలుగుల పండుగ దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ప్రకటించారు. ‘పబ్లిక్‌ స్కూల్‌ హాలిడేస్‌’ జాబితాలో దీపావళిని చేర్చామన్నారు. ఈ ఏడాది నవంబరు 12వ తేదీ ఆదివారం కావడంతో వచ్చే ఏడాది నుంచి దీపావళికి సెలవు ఉంటుందని వెల్లడిరచారు. పాఠశాల సెలవుల్లోని ‘బ్రూక్లీన్‌-క్వీన్స్‌డే’ స్థానంలో దీపావళిని చేర్చినట్లు ఆడమ్స్‌ తెలిపారు. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలన్న బిల్లును సెనేటర్‌ జో అడ్డాబ్బో ప్రవేశపెట్టగా న్యూయార్క్‌ సెనేట్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గవర్నర్‌ క్యాథీ హెచుల్‌ ఆమోదం లభిస్తే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. గవర్నర్‌ తప్పక బిల్లుపై సంతకం చేస్తారన్న విశ్వాసాన్ని మేయర్‌ కనబర్చారు. అసెంబ్లీ సభ్యుడు జెనిఫర్‌ రాజ్‌కుమార్‌, కమ్యూనిటీ నేతలతో కలిసి దీపావళిని సెలవు దినంగా ప్రకటించడం, అందుకోసం శ్రమించడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అందరి విజయమన్నారు. పండుగకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అందరికీ ముందుగానే ‘శుభ్‌ దివాలీ’ చెబుతున్నా అని ఆడమ్స్‌ ట్వీట్‌ చేశారు. భారతీయులతో కలిసి నిర్వహించిన కార్యక్రమం ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img