Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సుడాన్‌లో డ్రోన్‌ దాడి…43మంది దుర్మరణం

ఖార్టూమ్‌: ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో నాలుగు నెలలుగా సాగుతున్న అంతర్యుద్ధం… అమాయక పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. సైన్యం, పారామిలిటరీ దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొ న్నాయి. గత నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఆ దేశ రాజధాని ఖార్టూమ్‌ లో ఆదివారం బహిరంగ మార్కెట్‌పై డ్రోన్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 43 మంది అమాయక పౌరులు మృతిచెందినట్లు స్థానిక అధికారులు వెల్లడిరచారు. దాదాపు 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారందరినీ సుడాన్‌లోని బషీర్‌ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ డ్రోన్‌ దాడి తామే చేశామని ఎవరూ వెల్లడిర చలేదు. సుడాన్‌పై పట్టుకోసం సైన్యం, పారా మిలటరీ బలగాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ ఆధిపత్య పోరులో ఇప్పటి వరకూ 4,000 మందికి పైగా మరణించారు. అయితే వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంచనా. యునైటెడ్‌ నేషన్స్‌ శరణార్థ ఏజెన్సీ ప్రకారం ఈ ఘర్షణలతో తమ ప్రాంతాల నుంచి వలసోయిన వారి సంఖ్య 7.1 మిలియన్ల మందికి చేరుకోగా మరో 1.1 మిలియన్ల మంది పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img