Friday, April 19, 2024
Friday, April 19, 2024

సిడ్నీలో రహస్య ప్రదేశంలో ఎలిజబెత్‌ లేఖ

సిడ్నీ : బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌`2 ఆస్ట్రేలియాతో ముడిపడిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాణి రాసిన లేఖను సిడ్నీలో ఓ రహస్య ప్రదేశంలో భద్రపరచినట్లు తెలుస్తోంది. 1986 నవంబరులో ఆస్ట్రేలియా ప్రజలను ఉద్దేశించి రాసిన ఈ లేఖను మరో 63ఏళ్ల వరకు తెరిచేందుకు వీలు లేదని ఆస్ట్రేలియా మీడియా వెల్లడిరచింది. ప్రస్తుతం ఈ లేఖను సిడ్నీలోని క్వీన్‌ విక్టోరియా భవనంలో ఓ రహస్య ప్రదేశంలో భద్రపరచారు. అయితే అందులో ఏముందో ఆమె వ్యక్తిగత సిబ్బంది సహా ఎవరికీ తెలియదు. దీనిని 2085 వరకు ఈ లేఖను తెరచి, చదివేందుకు వీలు లేదు. 2085లో తగిన రోజు చూసుకుని తెరవండి. సిడ్నీ ప్రజలకు నా సందేశాన్ని చేరవేయండి అని నాటి నగర మేయర్‌ను ఉద్దేశించి రాణి సూచించినట్లు సమాచారం. ఆ లేఖపై ఎలిజబెత్‌ ఆర్‌ అనే సంతకం కూడా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img