Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

క్యూబాపై ఈయూ చర్యలు గర్హనీయం : కేకేఈ

ఏథెన్స్‌: క్యూబాను అణచివేసేందుకు, దాని ప్రతిష్ఠను దిగాజార్చేందుకు యూరోపియన్‌ పార్లమెంటు కుట్రలు చేస్తోందని, ఇది గర్హనీయమని గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) అగ్రనాయకులు వ్యాఖ్యానించారు. యూరోపియన్‌ పార్లమెంటు తాజా తీర్మానాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. క్యూబా ప్రజల విజయాలను తుంగలో తొక్కేలా తీర్మానం ఉందన్నారు. ప్రపంచ ప్రజల ఎదుట క్యూబా పరువు తీయాలన్న ఈయూ దీర్ఘకాలిక లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. క్యూబా ప్రజలపై అదనపు ఆంక్షలను ఈ తీర్మానం డిమాండ్‌ చేస్తోందన్నారు. ఆరు దశాబ్దాలుగా అనేక రకాల ఆంక్షలను అమెరికా, దాని మిత్రపక్షాలు విధిస్తూ క్యూబా ప్రజల హక్కులను, సాధించుకున్న విజయాలు, విప్లవాలు కాలరుస్తున్నట్లు తెలిపారు. నిత్యావసరాలు, మౌలిక వసతులకూ వారిని దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. క్యూబాకు, ఆ దేశ ప్రజలకు సంపూర్ణ సంఫీుభావాన్ని ప్రకటించారు. క్యూబాపై అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. అలాగే క్యూబా ప్రజల హక్కులకు గుర్తింపు, బాహ్య జోక్యంలేని భవిష్యత్‌ కోసం పోరాడతామని కేకేఈ నాయకులు ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img