Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

20 సంవత్సరాల కనిష్ఠానికి యూరో

ఫ్రాంక్‌ఫర్ట్‌: రెండు దశాబ్దాలలో మొదటి సారిగా యూరో యుఎస్‌ డాలర్‌తో సమానస్థాయికి దిగజారింది. ఏకంగా 20 సంవత్సరాల కనిష్టా నికి దిగజారింది. అంటే ఒక యుఎస్‌ డాలర్‌ విలువ ఒక యూరోకి సమానం. 19 యూరో పియన్‌ యూనియన్‌ దేశాల సింగిల్‌ కరెన్సీ యూరో డిసెంబర్‌ 2002 నుండి అమెరికా డాలర్‌ మారకం రేటుకు లేదా అంతకంటే తక్కువకు దిగజారలేదు. తాజాగా యూరో మంగళవారం ఉదయం నుండి పతనం కొనసాగుతోంది. ఇంట్రాడే ట్రేడిరగ్‌లో స్వల్పంగా అమెరికా డాలర్‌తో సమానంగా వర్తకం చేసింది. సమాన స్థాయికి చేరుకున్న తర్వాత, యూరో మారకం రేటు మళ్లీ కొద్దిగా పెరిగింది. డాలర్‌తో సమానంగా పడిపోయిన తర్వాత కూడా యూరో పతనం కొనసాగుతుందని సిటీ గ్రూప్‌లోని విదేశీ మారకద్రవ్య విశ్లేషకులు వెల్లడిరచారు. యూరోపి యన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) గణాంకాల ప్రకారం, సంవత్సరం ప్రారంభం నుండి యూరో అమెరికా డాలర్‌తో పోలిస్తే 10 శాతం క్షీణించింది.
పోర్చుగల్‌లో అత్యధిక ద్రవ్యోల్బణం
పోర్చుగల్‌ వార్షిక ద్రవ్యోల్బణం జూన్‌లో 8.7 శాతం నమోదైంది, ఇది డిసెంబర్‌ 1992 తర్వాత అత్యధికమని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్థ వెల్లడిరచింది. మే 2022లో నమోదైన 8 శాతంతో పోలిస్తే ద్రవ్యోల్బణం 0.7 శాతం పాయింట్లు పెరిగింది. ఇంధన సంబంధిత ద్రవ్యోల్బణం 31.7 శాతానికి పెరిగింది, గత నెల కంటే 4.4 శాతం పాయింట్ల పెరిగి ఆగస్టు 1984 నుండి చూస్తే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైంది. యూరో దేశాల్లో ఆహారం, మద్యం, పొగాకు, నాన్‌-ఎనర్జీ పారిశ్రామిక వస్తువులు,ు సేవల రంగాలలో పెరుగుతున్న ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img