Friday, December 8, 2023
Friday, December 8, 2023

అల్‌షిఫా ఆస్పత్రిలో బందీలు

వీడియో విడుదల చేసిన ఐడీఎఫ్‌
గాజా: గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్‌ షిఫాను హమాస్‌ తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా వాడుకుంటోందని ఇజ్రాయిల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్‌ సైన్యం అక్కడ తనిఖీలు చేపట్టింది. ఆస్పత్రి ఎంఆర్‌ఐ యూనిట్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలను కనుగొంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయిల్‌ రక్షక దళం (ఐడీఎఫ్‌ ) ఇప్పటికే విడుదల చేసింది. తాజాగా ఆసుపత్రిలో బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను విడుదల చేసింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్లు… వందల మంది ని తమ బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. వారిని అల్‌ షిఫా ఆసుపత్రిలోకి బలవంతంగా తీసుకెళ్తున్నట్లు ఉన్న వీడియోను ఐడీఎఫ్‌ ‘ఎక్స్‌’లో విడుదల చేసింది. ఈ దృశ్యాలు అక్టోబర్‌ 7న ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయినట్లు చూపిస్తోంది. అంతేకాకుండా ఆస్పత్రిలో 55 మీటర్ల పొడవున్న సొరంగాన్ని కూడా ఐడీఎఫ్‌ గుర్తించింది. గాజాలో సొరంగాలు, బంకర్ల పెద్ద నెట్‌వర్క్‌ ఉందని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. అయితే… ఇజ్రాయిల్‌ ఆరోపణల్ని హమాస్‌ ఖండిరచింది. సొరంగంపై ఇజ్రాయిల్‌ సైన్యం చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధమని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ మునీర్‌ ఎల్‌ బార్స్‌ పేర్కొన్నారు. ఎనిమిది రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నానని… అలాంటిదేమీ కనిపించలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img