వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిశంసనకు రంగం సిద్ధమవుతోంది. విదేశాల్లో ఆయన కుటుంబ సభ్యుల అధ్వర్యంలోని పథకాల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉండటంతో బైడెన్ అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ కసరత్తు చేస్తున్నట్లు స్పీకర్ కెవిన్ మకెకార్తి మంగళవారం తెలిపారు. తానెప్పుడు వ్యాపారం గురించి మాట్లాడలేదని, తన కుటుంబానికి చైనా నుంచి ఒక్క డాలర్ కూడా అందలేదని ఎన్నికల ప్రచారంలో బైడెన్ చెప్పారని గుర్తుచేశారు. అయితే ఆయన చెప్పింది అబద్ధమని ఇప్పుడు రుజువు చేయగలమని అన్నారు. దేశ మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాలన సమయంలో వాడిన విధానాలను బైడెన్ అనుసరిస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారన్నారు. బైడెన్ ప్రభుత్వం ముడుపులు అందుకున్నట్లు ఎఫ్‌బీఐ రికార్డు పేర్కొన్నట్లు ఇటీవల అమెరికా సెనేటర్ చెక్ గ్రాస్లే, సభ ఓవర్‌సైట్ కమిటీ చైర్మన్ జేమ్స్ కామెర్ ఓ ప్రకటన చేసినట్లు నిక్సన్ వెల్లడిరచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ నివేదిక రూపొందినట్లు తెలిపారు. బైడెన్ కుటుంబ సభ్యులు చెరో ఐదు మిలియన్ల ముడుపులను బుర్సిమాలో అవినీతి విచారణను అంతం చేసేందుకు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.