Monday, September 25, 2023
Monday, September 25, 2023

పాక్‌ ఆపద్ధర్మ ప్రధానిగా కాకర్‌ ప్రమాణం
90 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఎనిమిదవ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్‌ ఉల్‌ హఖ్‌ కాకర్‌ (52) ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి భవనం ‘ఐవాన్‌ ఎ సదర్‌’లో అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో కాకర్‌ తాను స్థాపించిన బలూచిస్థాన్‌ అవామీ పార్టీకి (బీఏపీ) రాజీనామా చేశారు. త్వరలోనే మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి నివాసంలో కాకర్‌కు సైనిక గౌరవ వందనం లభించింది. మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆపద్ధర్మ ప్రధాని కాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరయ్యారు. అయితే షరీఫ్‌కు వీడ్కోలు పలికే సందర్భంగా ఆయన కూడా సాయుధ దళాల గౌరవ వందనాన్ని అందుకున్నారు. ఈ నెల 9న పాక్‌ పార్లమెంట్‌ రద్దు అయిన సంగతి తెలిసిందే. పాక్‌ పార్లమెంట్‌ నియమాల ప్రకారం ప్రభుత్వం రద్దయిన 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఎన్నికల నిర్వహణ రెండు నెలలు ఆలస్యం కానున్నాయి. ఆపద్ధర్మ ప్రధానిగా కాకర్‌ ఎంపికపై ప్రతిపక్ష నేత రియాజ్‌ ఆపద్ధర్మ ప్రధానిగా చిన్న ప్రావిన్స్‌కు చెందిన నేత ఉండాలని నిర్ణయించామని, ఈ క్రమంలోనే బలూచిస్థాన్‌కు చెందిన కాకర్‌ పేరును తమ పార్టీ ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. దానిని మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా అంగీకరించారు. దీంతో కాకర్‌ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ఆమోదముద్ర వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img