ప్రపంచ నేతల సంఫీుభావం
న్యూయార్క్: లెట్ క్యూబా లివ్ (క్యూబాను బతకనివ్వండి) నినాదంతో న్యూయార్క్‌లో భారీ ప్రదర్శన జరిగింది. క్యూబాపై 60ఏళ్లకుపై ఉన్న అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు. అమానవీయ పద్ధతుల్లో క్యూబాపై నిర్బంధకాండ కొనసాగిస్తోందని అగ్రరాజ్యాన్ని దుయ్యబట్టారు. క్యూబాను ఏకాకి చేయాలని చూస్తోందని విమర్శించారు. స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం లిస్ట్ (ఎస్‌ఎస్‌టీఎల్)లో క్యూబాను చేర్చి 243 కొత్త ఆంక్షలను విధించి ఆదేశ ఆర్థిక వ్యవస్థకు మరింత దెబ్బతీసేలా కోవిడ్ కాలంలో ట్రంప్ యంత్రాంగం వ్యవహరించిందని అంతర్జాతీయ సమాజం వ్యాఖ్యానించింది. అమెరికా దుమనకాండ వల్ల ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థతో లావాదేవీలు జరపడాన్ని క్యూబాకు కష్టసాధ్యంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి నిత్యావసరాలను పొందలేని స్థితి నెలకొంది. ఇంధనం, ఆహారం, నిర్మాణ సామ్రాగి, పారిశుద్ధ్య ఉత్పత్తులు చివరకు మందుల సేకరణకూ అవరోధాలను అమెరికా సృష్టించింది. దీంతో క్యూబా ప్రజలు జీవితాలు దుర్భరమయ్యాయి. క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయాలన్న ‘లెట్ క్యూబా లివ్’ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ వద్ద ర్యాలీలో ది పీపుల్స్ ఫోరం, ది ఆన్సర్ కోయిలేషన్, ది పార్టీ ఫర్ సోషలిజం, లిబరేషన్, డిఫెండ్ డెమొక్రసీ ఇన్ బ్రెజిల్, ది డిసెంబర్ ట్వెల్త్ మూవ్‌మెంట్ తదితర సంఘాలు పాల్గొన్నాయి. క్యూబాకు సంఫీుభావాన్ని ప్రకటించాయి. అమెరికా ఆంక్షలను తిప్పికొట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి. మరోవైపు ప్రపంచ నేతలు, దౌత్యవేత్తలు క్యూడా క్యూబాకు సంఫీుభావం ప్రకటించారు. ఐరాసలో మాట్లాడే క్రమంలో క్యూబాపై అమెరికా ఆంక్షలను సభాముఖంగా వ్యతిరేకించారు. క్యూబా విషయంలో అమెరికా క్రూరంగా వ్యవహరిస్తోందని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా విమర్శించారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మాట్లాడుతూ జీ77G చైనా సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లే క్రమంలో హవానాకు వెళ్లినట్లు తెలిపారు. శాంతి నెలకొల్పడంలో కొలంబియాకు క్యూబా మద్దతిచ్చిందని, తాము ఆ దేశానికి మద్దతిస్తామని చెప్పారు.
ఆరు దశాబ్దాల ఆంక్షలను ఎత్తివేసి క్యూబాను ఆర్థికంగా పుంజుకునే అవకాశమివ్వాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా అన్నారు. ఇదిలావుంటే, ‘లెట్ క్యూబా లివ్’ ప్రచారోద్యమంలో భాగంగా పిటిషన్‌పై సంతకాలు చేసిన వారిలో బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్, భారత మేధావి, జర్నలిస్టు విజయ్ ప్రసాద్, మెక్సికన్ మొరేనా పార్టీ ప్రధాన కార్యదర్శి సిట్లాల్లి హెర్నాడెజ్ మోరా తదితరులు ఉన్నారు.