. యువ కమ్యూనిస్టుల సంకల్పం
. కేఎన్‌ఈ 32వ సామ్రాజ్యవాద
వ్యతిరేక శిబిరం విజయవంతం
ఏథెన్స్ : సామ్రాజ్యవాదాన్ని తిప్పికొడదామని గ్రీస్‌లోని యువ కూమ్యనిస్టులు సంకల్పించారు. ఇదే నినాదంతో ఈనెల 13`16 తేదీల్లో కస్టోరియా, నెస్టోరియోలో జరిగిన కేఎన్‌ఈ 32వ సామ్రాజ్యవాద వ్యతిరేక శిబిరంలో వేలాది మంది యువతీయువకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తాజాగా గ్రీస్‌లో జరిగిన ఎన్నికలను ప్రస్తావించారు. కమ్యూనిస్టులకు ఓట్లు పెరిగాయని చెప్పారు. మరింత మంది కమ్యూనిస్టులు మేయర్లుగా, మున్సిపల్, ప్రాదేశిక కౌనిలర్లుగా ఎన్నికయ్యేందుకు కసరత్తు చేయాలని పిలుపునిచ్చారు. పాలకుల పెట్టుబడిదారీ విధానాన్ని, సామ్రాజ్యవాద సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల కోసం పనిచేసే ప్రతినిధులు దేశానికి అవసరమని నొక్కిచెప్పారు. ప్రతి రోజు, ప్రతి గంట కేకేఈ ప్రజల వెంటే ఉంటుందని వక్కాణించారు. కార్మికులు, యువత పోరాటాలకు ముందుంటుందని, పనిప్రదేశాలు, స్కూలు, యూనివర్సిటీ తదితరాల్లో సమస్యలపై ఉద్యమాలకు నాయకత్వం వహిస్తుందని హామీనిచ్చారు. శక్తిమంతమైన కేకేఈ చరిత్ర స్ఫూర్తిపో ప్రజల తరపున పోరాటంలో తామెప్పుడు ముందు ఉంటామని కేకేఈ ప్రధాన కార్యదర్శి ఉద్ఘాటించారు. గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ ముందు నుంచి ప్రభుత్వ అవాస్తవాలను ఎత్తి చూపుతూ వచ్చిందని గుర్తుచేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో, నాటో విస్తరణలో దేశం క్రీయాశీల పాత్రను ఆక్షేపించారు. నాటో సదస్సుతో ప్రజలకు ముప్పు మరింత పెరిగిందన్నారు.