Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ప్రపంచ సవాళ్లను కలిసి పరిష్కరిద్దాం

. 78వ ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో గుటెర్రస్‌
. సర్వసభ్య సమావేశం నూతన అధ్యక్షుడిగా డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ నియామకం

ఐరాస: ఐక్యరాజ్య సమితి 78వ జనరల్‌ అసెంబ్లీ ప్రారంభమైంది. జనరల్‌ అసెంబ్లీ నూతన అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రస్‌ తరపున ఆయన సందేశాన్ని సభకు సహాయక కార్యదర్శి అమీనా మహమ్మద్‌ చదివి వినిపించారు. సవాళ్లు, సమస్యలు, విభజనలతో కూడుకున్న ప్రపంచం… ఐరాసను పరీక్షిస్తోందని గుటెర్రస్‌ హెచ్చరించినట్లు వెల్లడిరచారు. అంతర్జాతీయ సవాళ్లు చుట్టుముట్టి ఉన్నప్పటికీ నైరాశ్యానికి ఇది సమయం కాదని ఆయనన్నట్లు చెప్పారు. సవాళ్ల పరిష్కారానికి ఐక్యకృషి జరగాలని గెటెర్రస్‌ సూచించారు. ఇది చర్యలు తీసుకునే సమయమని స్పష్టంచేశారు. శాంతి నెలకొల్పడం, మానవహక్కులను పరిరక్షించడం, సుస్థిరాభివృద్ధి లక్షాలను సాధించడం, వాతావరణ మార్పు నేపథ్య సవాళ్లను పరిష్కరించడం, ఉద్యోగావకాశాలను సృష్టించుకోవడం ముఖ్యంగా మహిళలు, యువత సాధికారతా దిశగా చర్యలకు ఇదే సమయమని నొక్కిచెప్పారు. కృత్రిమ మేధస్సు వంటి సాంకేతిక విస్తృత వ్యాప్తితో ఎంతో సాయం అందుతుందని, సాంకేతికతో మానవ వికాశం జరుగుతుందేగానీ నష్టం కాదన్నారు. కలిసికట్టుగా ప్రగతిపథంలో ముందుకు సాగే హామీ, ఆశాజనక ప్రపంచ నిర్మాణానికి చర్యలు తీసుకోనే సమయం ఆసన్నమైందని గుటెర్రస్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం తీసుకునే నిర్ణయాలకు ఐరాస సర్వసభ్య సమావేశానికి మించిన వేదిక వేరొకటి లేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు పరిష్కారాలు కనుగొనడమే కాకుండా పురోగతి సాధించే దిశగా మెరుగైన, శాంతి, సుస్థిరతతో కూడుకున్న ఆరోగ్యకర సమాజ స్థాపనకు కలిసి కృషిచేద్దామని గుటెర్రస్‌ పిలుపునిచ్చారు. తొలుత సభను డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బలహీనుల సాధికారత, శాంతి స్థాపన కోసం, సుస్థిరత, సుసంపన్నత కోసం కలిసిమెలిసి పనిచేయాలని సభ్యదేశాలకు సూచించారు. తమకున్న వనరులను పంచుకుంటూ పరస్పరం సహకరించుకోవాలని హితవు పలికారు. పురోగతిని వేగవంతం చేయాలని, యువతకు ఉజ్వల భవిష్యత్‌కు హామీ ఇవ్వాలన్నారు. సృజనాత్మక, కొత్త ఆవిష్కరణలు, సాంకేతికపరమైన అభివృద్ధికి సంస్కరణాత్మక బాటలో కలిసి పయనిద్దామని పిలుపునిచ్చారు. ప్రాదేశిక, ఇతర సంఘాలు సమగ్రంగా అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమ్మిళిత సహకారం ఆనుసరణీయమని సూచించారు. సమస్యల పరిష్కారానికి బహుపాక్షికవాదాన్ని ఆచరించాలని ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. కాగా, ఫ్రాన్సిస్‌ మంగళవారం ఉదయం ఐరాస 77వ సర్వసభ్య సమావేశం ముగింపు సందర్భంగా జనరల్‌ అసెంబ్లీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img