Friday, September 22, 2023
Friday, September 22, 2023

కలెక్టరును సత్కరించిన మీడియా కమిటి సభ్యులు

విశాలాంధ్ర – పార్వతీపురం : పార్వతీపురం మన్యంజిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన సోమవారంనాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈసమావేశంలో అన్నిఅర్హతలు కలిగి,ఆన్ లైన్లో నిర్ణీతసమయంలోగా దరఖాస్తులు చేసుకున్న 139మందికి మొదటి విడతగా అక్రిడిటేషన్లు మంజూరుచేస్తూ జిల్లా కలెక్టరు ఆమోదం తెలిపారు.
ఈసంధర్భంగా జిల్లాను అభివృద్ది పథంలో తీసుకువెళుతూ జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చినందుకు జిల్లా కలెక్టర్ ను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శాలువకప్పి బోకేను అందజేసి సత్కరించి అభినందనలు తెలిపారు.ఈసమావేశంలో కమిటీ సభ్యులైన డి.పి.టి. ఓ టి.వి.ఎస్.సుధాకర్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.రమేష్, కార్మిక శాఖ సహాయ కమీషనర్ కె. రామకృష్ణారావు, ఆరోగ్య శ్రీ టీమ్ లీడర్ భామ, పత్రికా ప్రతినిధులు ఏ.జయంత్ కుమార్ (సాక్షి) ఎం.రమేష్ (విశాలాంధ్ర) ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు టి.నవీన్( సాక్షి)టి. శ్రీనివాసరావు( టీవీ-9) కన్వీనరైన డి.పి.ఆర్.ఓ లోచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img