వివాదాస్పద కార్మిక బిల్లుకు ఆమోదం
ఏథెన్స్: గ్రీస్‌లో కార్మికులు ఇక నుంచి రోజుకు 13 గంటలు, వారానికి ఆరు రోజులు పనిచేయాల్సి ఉంటుంది. సమ్మెబాట పట్టేందుకు వీలు ఉండదు. ఆందోళనకు దిగితే జరిమానా విధిస్తారు లేదంటే ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. ఈ మేరకు కన్జర్వేటివ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద కార్మిక బిల్లుకు గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. రోజుకు ఎనిమిది గంటలు, వారానికి 40 గంటల పని విధానానికి స్వస్థి పలికింది. కొత్త చట్టాన్ని కన్జర్వేటివ్ పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా 300మంది సభ్యులలో 158 మంది మద్దతు తెలిపారు. అధికార న్యూ డెమొక్రసీ పార్టీ ఆధిపత్యం కనిపించింది. మిగతా పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకించాయి. పార్లమెంటులో ఓటింగ్‌కు ముందు కార్మిక మంత్రి అడోనిస్ జార్జియాడిస్ ప్రసంగించారు. బిల్లును సమర్థించారు. ఇది ఓవర్‌టైమ్ భారాన్ని తగ్గించడమే కాకుండా కార్మికులకు రక్షణ కల్పిస్తుందని వెల్లడిరచారు. వారానికి ఒక పని దినం పెరగడం ద్వారా దినసరి వేతనంలో 40శాతం అదనంగా వర్కర్లకు లభిస్తుందని అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఈ బిల్లు వల్ల యజమాని ఎప్పుడు రమ్మంటే అప్పుడు పనికి వెళ్లే పరిస్థితి ఉద్యోగులకు ఉంటుందని ‘ఆన్`కాల్ ఎంప్లాయీస్’ విధానానికి ఇది తెరతీసినట్టు వెల్లడిరచారు.