Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇరాన్‌ అణు ఒప్పందంపై చర్చల పునరుద్ధరణ

వియన్నా: ఇరాన్‌ అణు చర్చలలో ముందస్తు ఒప్పందం అమలుకు తక్షణ నిర్ణయం తీసుకోవాలని ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి వాంగ్‌ అమెరికాను కోరారు. ఐదు నెలల విరామం తర్వాత గత వారం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో తిరిగి ప్రారంభమైన చర్చల సందర్భంగా వాంగ్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా పిలువబడే 2015 ఇరాన్‌ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. ఇరాన్‌ అణు సమస్యను పరిష్కరించడానికి చర్చలు, చర్చల ద్వారా విభేదాలను తగ్గించడం ఒక్కటే మార్గమని వాంగ్‌ పేర్కొన్నారు. అన్ని దేశాలు ప్రస్తుత అవకాశాలను ఉపయోగించుకోవాలని, ఆచరణాత్మక, సౌకర్యవం తమైన విధానాలను అవలంబించాలని, ఒకరి ఆందోళనలు, ప్రయోజనాలను మరొకరు గౌరవించుకోవాలని, దానికి అనుకూల వాతా వరణాన్ని సృష్టించాలని, ప్యాకేజీ పరిష్కారంతో అసాధారణ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఇరాన్‌కు వ్యతిరే కంగా అమెరికా వివిధ చర్యలు చేపట్టిందని చైనా సహా అనేక దేశాలపై కొత్త ఆంక్షలు విధించిందని చైనా రాయబారి పేర్కొన్నారు. ‘ఇరాన్‌ అణు సంక్షోభానికి మూలకర్తగా అమెరికా ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి, చిత్తశుద్ధి చూపాలి, రాజకీయీకరణను విడిచిపెట్టాలి, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక సమస్యలపై ద్వంద్వ ప్రమాణాలను వర్తింపజేయడం మానుకోవాలని ముందస్తు ఒప్పందాన్ని ప్రోత్సహించడానికి తక్షణమే రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని వాంగ్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘చైనా ప్రయోజనాలను దెబ్బతీసే ఏ ప్రయత్నమూ ఆమోదయోగ్యం కాదని వాంగ్‌ పేర్కొన్నారు. చైనా నిర్మాణాత్మకంగా పాల్గొనడం బహుపాక్షికత పట్ల దాని నిబద్ధతను తెలియజేస్తోందని, అటువంటి చర్చలను ప్రోత్సహించడంలో చైనా చేస్తున్న ప్రయ త్నాలు కొత్త తరహా అంతర్జాతీయ సంబంధాలను, మానవాళికి భాగస్వామ్య భవిష్యత్తుతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి దాని ప్రయత్నాలను హైలైట్‌ చేస్తున్నాయని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img