గ్రీస్ఇటలీ
టర్కీ రవాణా కార్మిక సంఘాల ఉమ్మడి పిలుపు
పలస్తీనా ప్రజల మారణహోమాన్ని తక్షణమే ఆపాలని గ్రీస్ఇటలీ
టర్కీ రవాణా కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రజల అణచివేత, దురాక్రమణ, వివక్ష, ఫాసిజాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఎల్లప్పుడు శాంతి పక్షాన్నే నిలుస్తామని స్పష్టంచేశాయి. యూరప్‌లోని నౌకాశయాలు, విమానాశయాలు, నౌకలు, రైళ్లను మృత్యువుకు రవాణా కేంద్రాలుగా మార్చడాన్ని సహించబోమని తేల్చిచెప్పాయి. నౌకలు, విమానాలు తదితరాల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తూ లాజిస్టిక్ సేవలు అందిస్తూ దాడులకు సహకరించడాన్ని ఉపేక్షించేది లేదని ప్రభుత్వాలకు తేల్చిచెప్పాయి. ప్రతిరోజు వేలాది మంది అమాయక ప్రజలు ముఖ్యంగా పిల్లలు, మహిళల ప్రాణాలు హరించే వ్యవస్థను పెంచిపోషించేందుకు ఎంత మాత్రం అంగీకరించబోమని వెల్లడిరచాయి. పలస్తీనా ప్రజలు, కార్మికుల ఫిర్యాదులకు స్పందించిన ఇటలీ, గ్రీస్, టర్కీ రవాణా కార్మికుల ప్రతినిధులు, కార్మిక సంఘాలు … పలస్తీనా ప్రజల మారణహోమానికి దోహదమయ్యే ఆయుధాలు, యుద్ధ సామాగ్రి రవాణాను అడ్డుకోవాలని ఉమ్మడిగా నిర్ణయించాయి. యూరప్ రవాణా కార్మికుల శాంతి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సంయుక్త నిర్ణయం మరో ముందడుగని ప్రకటన తెలిపింది. గాజాలో మారణహోమాన్ని ముగించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు పోరాటం చేసేందుకు అగ్రభాగాన నిలుస్తామని కార్మిక సంఘాలు వెల్లడిరచాయి. పలస్తీనా ప్రజల ఊచకోతకు సాయం చేయొద్దని, ఆయుధ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని ఆయా ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. పలస్తీనా విమోచనానికి, శాంతికి పిలుపునిచ్చాయి. తమ పోరాటంలో కలిసి రావాలని యూరప్‌లోని నౌకాశయాలు, విమానాశ్రయాలు, రైల్వే, రవాణా కార్మికులకు ఇటలీ, యూఎస్‌బీ ట్రాన్స్‌పోర్ట్, ఎనేడెప్`కాస్కో డాక్టర్స్ యూనియన్, గ్రీస్, స్టెఫెన్‌సన్, పెమెన్, పీమేజ్ మారిటైమ్ యూనియన్లు, గ్రీస్, టర్కీలోని నక్లియాత్ పిలుపునిచ్చాయి.