Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

బ్రిటన్‌ ప్రధాని రేసులో సునాక్‌, ట్రజ్‌

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని పీఠానికి బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లో ఇంగ్లాండ్‌ మాజీ మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ (42) భారీ మెజారిటీతో విజయం సాధించారు. అధికార కన్సర్వేటివ్‌ పార్టీఎంపీలు రిషి సునాక్‌కు 137మంది ఓటు వేయగా సమీప పోటీదారు విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రజ్‌కు 113 ఓట్లు వచ్చాయి. 105 ఓట్లు పొందిన వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మెర్టాంట్‌ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నారు. మొదటి నుంచి చివరి రౌండ్‌ వరకు రిషి సునాక్‌ పోటీలో అగ్రస్థానంలో నిలిచారు. తుది పోటీకి చేరిన రిషీ, ట్రజ్‌లో ఒకరిని రెండు లక్షలమంది ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు ఓటింగ్‌ ద్వారా తమ నేతగా ఎన్నుకుంటారు. వీరంతా ఆన్‌లైన్‌ లేదా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పార్టీ సభ్యుల మద్దతు కోసం రిషీ, ట్రజ్‌లు రాబోయే కొన్ని వారాల పాటు విస్త్రతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమవారం జరిగే టీవీ చర్చంల్లో వీరిద్దరూ ముఖాముఖి తలపడతారు. సెప్టెంబర్‌ 5న బ్రిటన్‌ కొత్త ప్రధాని మంత్రి పేరును ప్రకటిస్తారు. ’రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో లేబర్‌ పార్టీని ఓడిరచగల నేతకే టోరీ సభ్యులు ఓటేస్తారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఆ సత్తా ఉన్నది రిషికే. కాబట్టి ఆయన విజయం ఖాయం’’ అని సమాచారం.పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారే బ్రిటన్‌ ప్రధానిగా ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img