Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఐదు కేసుల్లో సూకీకి ఊరట

యాంగోన్‌: మైన్మార్‌ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీకి ఐదు క్రిమినల్‌ కేసులో ఊరట లభించింది. ఆమెపై ఇంకా 14 కేసులు ఉన్నాయి. బుద్ధిస్ట్‌ లెంట్‌ సంద్భంగా ఏడు వేల మందికిపైగా ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. ఇందులో భాగంగానే సూకీని సైనిక జుంటా ఐదు కేసుల్లో క్షమించినట్లు మంగళవారం స్థానిక మీడియా పేర్కొంది. ఆంగ్‌ సాన్‌ సూకీని స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ క్షమించారని వార్తానివేదిక తెలిపింది. 2021లో సైనిక తిరుగుబాటు జరిగిన క్రమంలో సూకీ ప్రభుత్వం కూలిపోగా అప్పటినుంచి ఆమె నిర్బంధంలో ఉన్నారు. అవినీతి, అక్రమంగా వాకీటాకీలు కలిగివుండటం, కోవిడ్‌ ఆంక్షలను అతిక్రమించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు కాగా ఆమెకు 33ఏళ్ల జైలుశిక్ష పడిరది. తాజాగా ఐదు కేసుల్లో క్షమాభిక్ష లభించగా సూకీపై మరో 14 కేసులు నడుస్తున్నాయి. కాబట్టి ఆమెకు పూర్తిగా ఊరట లభించలేదని న్యాయ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img