Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

బ్రిటన్‌లో తమిళ విద్యార్థి మృతి


లండన్‌: ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌ వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి లండన్‌లో హత్యకు గురైన ఘటన మరువక ముందే మరొక భారత విద్యార్థి మృత్యువాత పడటం కలకలం రేపింది. తమిళనాడు, కోయంబత్తూరుకు చెందిన జీవంత్‌ శివకుమార్‌ (25) బర్మింగ్‌హామ్‌లో సోమవారం మరణించారు. లండన్‌, అస్టన్‌ యూనివర్సిటీలో స్ట్రాటజీ, ఇంటర్నేషనల్‌ బిజిసెస్‌లో ఎంఎస్సీ చేస్తున్నారు. ఆయన కోయంబత్తూరులో బీటెక్‌ చేసి ఎంఎస్‌ చేసేందుకు బ్రిటన్‌ వెళ్లారు. జీవంత్‌ మృతదేహం బిర్మింగ్‌హామ్‌ కాలువలో లభ్యమైందని వెస్ట్‌ మిడ్‌లాండ్స్‌ పోలీసులు తెలిపారు. ఇది అనుమానస్పద మరణం కాదని వెల్లడిరచారు. జీవంత్‌ ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. అంబులెన్స్‌ పిలిపించినా ఫలితం దక్కలేదన్నారు. విద్యార్థి మరణవార్తను తల్లిదండ్రులకు అందజేసినట్లు లండన్‌లోని భారతీయ దౌత్యకార్యాలయం వెల్లడిరచింది. తమ బిడ్డ మరణం వెనుక ఏదో కుట్ర ఉన్నదని వారు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాతే జీవంత్‌ మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు తమతో చెప్పినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపినట్లు పేర్కొంది. కాగా ఇంగ్లండ్‌లోని భారతీయ దౌత్యకార్యాలయం ద్వారా తమకు జీవంత్‌ మరణించినట్లు సమాచారం అందిందని, మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అనుసరించే ప్రక్రియ గురించి తమకు తెలియదని, బర్మింగ్‌హామ్‌లో పరిస్థితిని జీవంత్‌ స్నేహితులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారని కుటుంబసభ్యులు వెల్లడిరచారు. జీవంత్‌ మరణానికిగల కారణాలు తెలియలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img