Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

క్యూబా దౌత్యకార్యాలయంపై ఉగ్రదాడి

రెండు మొలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌ విసిరిన దుండగుడు

హవానా : అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్‌ డీసీలోగల క్యూబా దౌత్య కార్యాలయంపై ఆదివారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి రెండు మొలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌ను భవనంపైకి విసిరాడు. ఇదే భవనంపై ఉగ్రదాడి జరగడం రెండో సారి కాగా 2020లోనూ ఏకే 47తో దాడి జరిగింది. ఈ దాడిని క్యూబా తీవ్రంగా ఖండిర చింది. తమ దేశంపై ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం రెచ్చిపోతుంటే క్యూబా వ్యతిరేక సంఘాలు ఇటువంటి దుశ్చర్యల ద్వారా వినోదం పొందుతున్నాయని దుయ్యబట్టింది. ఎక్స్‌ మాధ్య మంగా క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్స్‌ స్పందిస్తూ రాయబార కార్యాలయంపై రెండు మొలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌తో దాడి జరిగినట్లు తెలిపారు. ఎవరికి గాయాలు కాలేదన్నారు. ఈ దాడిపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడిరచారు. 2020 ఏప్రిల్‌లో ఏకే 47 మారణాయుధంతో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడని గుర్తుచేశారు. 2021 జులైలో ఫ్రాన్స్‌లోని క్యూబా దౌత్యకార్యాలయంపై మొలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌తో దాడి జరిగిందన్నారు. న్యూయార్క్‌లో జరిగిన 78వ ఐరాస సర్వసభ సమావేశానికి హాజరైన క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కెనాల్‌ తిరిగి హవానాకు చేరుకున్న కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. క్యూబా ప్రస్తుతం జీ77G చైనా కూట మికి అధ్యక్షత వహిస్తోంది. క్యూబా దౌత్యకార్యాలయంపై దాడి గురించి ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం స్పందించలేదు. అయితే ఉగ్రవాదులకు రక్షణ కల్పించడాన్ని అమెరికా మాను కోవాలని, తాజా ఘటనపై దర్యాప్తు జరిపించాలని పీపుల్స్‌ ఫోరం తరపున సంస్థ డైరెక్టర్‌ మొనోలో డే లాస్‌ శాంటోస్‌ డిమాండ్‌ చేశారు. ఇటువంటి దాడులను ఉగ్రవాద దుశ్చర్యగా పరిగణించాలని అమెరికా ప్రభుత్వానికి నేషనల్‌ నెట్వర్క్‌ ఆన్‌ క్యూబా (ఎన్‌ఎన్‌ఓసీ) ప్రతినిధి కల్లా వాష్‌ సూచించారు. క్యూబాకు మద్దతు ప్రకటించారు. క్యూబాపై యుద్ధాన్ని, అమెరికా దిగ్బంధాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. 2020లో జరిగిన దాడి వల్ల బుల్లెట్లు దిగిన ఆనవాళ్లు భవనంలో నేటికీ ఉన్నాయని వెల్లడిరచారు. క్యూబా దౌత్యకార్యాలయం వద్దకు చేరుకొని సంఫీుభావం ప్రకటించాలని అమెరికా ప్రజలకు ఎన్‌ఎన్‌ఓసీ పిలుపునిచ్చింది. క్యూబా దౌత్యకార్యాలయంపై దాడిని బ్రిడ్జెజ్‌ ఆఫ్‌ లవ్‌, డీసీ చాప్టర్‌ ఆఫ్‌ ది కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ది యూఎస్‌ఎస్‌ తీవ్రంగా ఖండిరచాయి. క్యూబాకు వెనిజులా, మెక్సికో తదితర దేశాలు సంఫీుభావం ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నట్లు క్యూబాపై అమెరికా ఆరోపణలు చేస్తుంది కానీ వాస్తవానికి ఉగ్రదాడుల బాధిత దేశంగా క్యూబా ఉందని అమెరికాకు చెందిన యుద్ధ వ్యతిరేక సంఘం ‘కోడెపింక్‌’ సహ`వ్యవస్థాపకులు మాడియే బెంజమిన్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img