నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు టనహూన్ జిల్లాలో మర్స్యంగడి నదిలోకి దూసుకెళ్లింది. బస్సు పోఖరా నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు యూపీ నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.