Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

నైగర్‌లో ముదిరిన సంక్షోభం

. సైనిక జోక్యాన్ని వ్యతిరేకించిన బుర్కినా ఫాసో, మాలీ
. తమ పౌరుల ఎయిర్‌ లిఫ్ట్‌కు ఫ్రాన్స్‌ చర్యలు
. ఈసీఓడబ్ల్యూఏఎస్‌ ఆర్థిక, వాణిజ్య, ప్రయాణ ఆంక్షలు
. జుంటాకు మద్దతుగా భారీ ర్యాలీ

     నియామే: నైగర్‌లో సంక్షోభం మరింత ముదిరింది. నైగర్‌పై సైనిక జోక్యాన్ని బుర్కినా ఫాసో, మాలీపై యుద్ధాన్ని ప్రకటించడంగా పరిగణిస్తామని ఆ దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా నైగర్‌లోని తమ వారిని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసేందుకు ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నైగర్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ బజౌమ్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు జరిగింది. దీంతో ప్రయాణ, ఆర్థిక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తిరనడానికి తిండి లేక, అద్దె కట్టెందుకు డబ్బు లేక నైగర్‌ జనాభాలో చాలా మంది తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడారాల్లో జీవిస్తుంటారు. తాజా పరిస్థితు లతో వారి జీవితాలు మరింత దుర్భరమ య్యాయి. పశ్చిమ ఆఫ్రికా ప్రాదేశిక సంఘం ‘ఈసీఓడబ్ల్యూ ఏఎస్‌’ ఆంక్షలు విధించడమే కాకుండా వారంలోగా బజౌమ్‌లో పూర్వ పరిస్థితులను నెలకొల్పాలని తిరుగుబాటు నేతలకు హెచ్చరిక చేసింది. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పబోవని కూడా తేల్చిచెప్పింది. నైగర్‌తో పాటు ఇతర సభ్య దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక లావాదేవీలను ఈసీఓడబ్ల్యూ ఏఎస్‌ నిలువరించింది. ప్రాంతీయ కేంద్ర బ్యాంకుల్లోని నైజీరియన్‌ ఆస్తులను ఫ్రీజ్‌ చేసింది. విదేశీ సాయంపై ఎక్కువగా ఆధారపడే నైగర్‌ తాజా ఆంక్షలతో స్తంభించిపోయింది. సుమారు 25 మిలియన్లకుపైగా ప్రజల దుస్థితికి దారితీసింది.  అయితే తిరుగుబాటు నేతలకు నైగర్‌ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ‘రష్యా వర్థిల్లాలి, డౌన్‌ ఫ్రాన్స్‌’ అన్న నినాదాలు మార్మ్రోగాయి. ఆదివారం రాజ ధానిలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయాన్ని నిరసన కారులు ధ్వంసం చేశారు. ఈసీఓడబ్ల్యూఏఎస్‌ నిర్ణయాన్ని ముందే గ్రహించిన నైగర్‌లోని జుంటాకు మద్దతుదారులు వేలాది మంది రాజధాని నియామేలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రష్యా జెండాలు ప్రదర్శిస్తూ ఫ్రాన్స్‌ను దుయ్యబట్టారు. ‘డౌన్‌ విత్‌ ఫ్రాన్స్‌’, ‘లాంగ్‌ లివ్‌ పుతిన్‌’ ప్లకార్డులు ప్రదర్శించారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ అంతర్జాతీయ సమాజాన్ని దూరంగా ఉండా లని సూచించారు.  ఘర్షణాత్మక పరిస్థితుల్లో తమ పౌరులను ఎయిర్‌లిఫ్ట్‌ చేసేందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం మంగళవారం  చర్యలు ప్రక్రియను చేపట్టింది. అత్యవసరమైనవి, ఆహారం, తాగునీరు, ఫోన్లు, బ్యాటరీలతో కూడిన చిన్న బ్యాగు సర్దుకోమని బయల్దేరమని తమ వారికి సూచించింది. ఫ్రెంచ్‌ పౌరుల భార్యాపిల్లలు కూడా ఎయిర్‌లిఫ్ట్‌కు అర్హులేనని ఈమెయిల్‌ ద్వారా స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్‌ ప్రజలను అక్కడ నుంచి ఖాళీ చేయించడమే ప్రత్యామ్నాయమని పేర్కొంది. మరోవైపు బాలీ, బుర్కినా ఫాసోలోని సైనిక ప్రభుత్వాలు సంయుక్త ప్రకటనలో నైగర్‌కు వ్యతిరేకంగా సైనిక జోక్యాన్ని తమ దేశాలపై యుద్ధం ప్రకటించినట్లు పరిగణిస్తామని తేల్చిచెప్పాయి. మాలీ, బుర్కినాఫాసోలో 2020 నుంచి రెండుసార్లు తిరుగు బాట్లు జరిగాయి. ప్రభుత్వాలను కూల్చి సైనికులు ఆధిపత్యాన్ని ప్రకటించాయి. ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ ఖైదాతో ముడిపడ్డ హింసను సమర్థంగా కట్టడి చేయగలమని చెప్పుఖున్నాయి. అయితే ఈసీఓడబ్ల్యూఏఎస్‌ ఆ రెండు దేశాలపై ఆంక్షలు విధించింది. బ్లాక్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. ఎన్నడూ కూడా బలవంతపు చర్యలు తీసుకోవద్దని హెచ్చరించింది. 2021 నుంచి సైనిక పాలనలో ఉన్న గునియా దేశం కోసం నైగర్‌లో జుంటాకు మద్దతు ప్రకటించింది. ‘స్పృహలోకి రావాలి’ అంటూ ఈసీఓడబ్ల్యూ ఏఎస్‌కు సూచించింది. ఈ సంఘం ఆంక్షలే ప్రస్తుత సంక్షోభానికి కారణమని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img