Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం పునరైక్యం కావాలి

గ్రీసు కమ్యూనిస్టు పార్టీల పిలుపు

ఏథెన్స్‌: ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేకతపై అభిప్రాయాలను పంచుకునే అవకాశం లభించినం దుకు ప్రపంచవ్యాప్త కమ్యూనిస్టు పార్టీలు ఏథెన్స్‌ సమావేశంలో సంతృప్తి వ్యక్తం చేశాయి. అంతర్జా తీయ, జాతీయ స్థాయి పరిణామాలు, ఉక్రెయిన్‌లో సామ్రాజ్యవాద యుద్ధం నేపధ్యంలో గ్రీస్‌, మెక్సికో, వర్కర్స్‌ ఆఫ్‌ స్పెయిన్‌, టర్కీ కమ్యూనిస్టు పార్టీల జనరల్‌ సెక్రటరీలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కేకేఈ), సీపీ ఆఫ్‌ మెక్సికో (పీసీఎమ్‌), సీపీ ఆఫ్‌˜్‌ స్పెయిన్‌ (పీసీటీఈ), సీపీ ఆఫ్‌ టర్కీ (టీకేపీ) ఏథెన్స్‌లో జరిగిన చతుర్భుజ సమావేశంలో 4 సీపీల ప్రధాన కార్యద ర్శులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూ నిస్టు, వర్కర్స్‌ పార్టీలు శాస్త్రీయ కమ్యూనిజం సూత్రా లపై తమ ఉమ్మడి పోరాటాల్ని అభివృద్ధి చేయాలని సంకల్పించాయి. మార్క్సిజం-లెనినిజం, శ్రామికవర్గ అంతర్జాతీయవాదం, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ విప్లవాత్మక పునర్వ్యవస్థీకరణను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నాయి. తమ పార్టీలతో పాటు ఇతర సీపీలు కూడా శ్రామికవర్గం, జనాదరణ పొందిన వర్గాలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటామని ప్రకటించాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ ఏకీకృత విప్లవాత్మక వ్యూహం పెట్టుబడి దారీ వ్యవస్థ నుండి సోషలిజానికి విప్లవా త్మక పరివర్తన యుగంగా పేర్కొన్నారు. ఉదారవాద, సామాజిక ప్రజాస్వామ్య పార్టీలు రెండిరటికీ వ్యతిరేకంగా, గుత్తాధి పత్యాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న బూర్జువా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం తమ కర్తవ్యమని ఈ సమావేశం పేర్కొంది. ఉక్రెయిన్‌లో యుద్ధంలో యుఎస్‌, నాటో, ఈయూల ప్రయోజనాలు, ప్రణాళి కలతో ప్రపంచంలోని మార్కెట్లు, ముడి పదార్థాలు, రవాణా నెట్‌వర్క్‌ల నియంత్రణ ఘోరంగా దెబ్బ తిన్నాయిని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాం తాలలో ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా, అమెరికా గుత్తాధిపత్య పోకడల మధ్య ఘర్షణ జరుగుతున్న దేశాలలో సామ్రాజ్యవాద ప్రమాదం ఎక్కువగా ఉంది. అన్ని రకాల సామ్రాజ్యవాద కూటములకు వ్యతిరే కంగా పోరాడుతామని కమ్యూనిస్టుపార్టీలు ప్రతిన పూనాయి. ప్రజావ్యతిరేక సంఘాలలో కమ్యూనిస్టు దేశాలు పాల్గొనడాన్ని ఖండిస్తామని పేర్కొ న్నారు. కార్మికులు ‘తప్పుడు అజెండా’ కింద చిక్కుకో కుండా, బహుళజాతి సంఘాలతో విభేదిస్తూ వారి స్వంత ప్రయోజనాలను కాపాడుకునేలా కృషిని తీవ్ర తరం చేస్తామని ప్రతిన పూనాయి. కమ్యూనిస్టు ఉద్య మంలోనే అవకాశవాదానికి వ్యతిరేకంగా, జాత్యహం కారం, ఫాసిజం, జాతీయవాదం, కాస్మోపాలిటనిజం రెండిరటినీ వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. ప్రజల కోసం ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా సోషలిజం-కమ్యూనిజం ఆవశ్యకతను కమ్యూనిస్టు పార్టీలు కట్టుబడి ఉంటాయని ఈ సమావేశం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img