Friday, December 8, 2023
Friday, December 8, 2023

పలస్తీనా ప్రజలకు కమ్యూనిస్టు యువజన సంఘాల సంఫీుభావం

పలస్తీనా: గాజా స్ట్రిప్‌, వెస్ట్‌ బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దూకుడ, దిగ్బంధనాన్ని నిలువరించాలని ప్రపంచవ్యాప్త కమ్యూనిస్టు యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యయాత్రలు నిర్వహించనున్నాయిు. పోరాటాలు చేసేందుకు వీధుల్లోకి రావాలని యువజన సంఘాలు ముఖ్యంగా యువతకు, ప్రజలను మేము కోరుతున్నాము. పలస్తీనా ప్రజలకు మేము మా పూర్తి సంఫీుభావాన్ని తెలియజేస్తున్నామని ప్రకటించాయి. గాజా స్ట్రిప్‌లో మరణించిన వేలాది మంది పౌరులు, పిల్లలు, వృద్ధులకు ఆహారం, నీరు, మందులు, విద్యుత్తు లేకుండా ఇజ్రాయిల్‌ చేసిన క్రూరమైన సైనిక దాడి, అమానవీయ దిగ్బంధనంగా పేర్కొంది. పలస్తీనా ప్రజలపై జరుగుతున్న అనాగరిక మారణహోమాన్ని ఖండిస్తున్నామని ముక్తకంఠంతో ప్రకటించాయి. ఇజ్రాయిల్‌ దాడికి అమెరికా, బ్రిటన్‌, నాటో, ఈయూ మద్దతును మేము ఖండిస్తున్నామని తెలిపాయి.
పలస్తీనా భూభాగాలపై దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ చేస్తున్న ఆక్రమణ, హత్యలు, జైలు శిక్ష, హింస, సెటిల్మెంట్లను మేము ఖండిస్తున్నాము. పలస్తీనా ప్రజల స్వేచ్ఛా మాతృభూమికి, వారి స్వంత భూమిపై యజమానులుగా ఉండే హక్కును మేము సమర్థిస్తామని ప్రకటించాయి. ఇజ్రాయిల్‌ ఆక్రమణకు ముగింపు పలకాలని, స్వతంత్ర పలస్తీనా రాజ్యాన్ని సృష్టించడం, గుర్తించడం, పలస్తీనా భూభాగాల్లో అక్రమ స్థావరాలను నిలిపివేయడం, కూల్చివేయడం, ఇజ్రాయిల్‌ జైళ్ల నుండి ఖైదీలను విడుదల చేయడం, ఐరాస తీర్మానం 194 ప్రకారం శరణార్థులను తిరిగి తీసుకురావాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము. ఇజ్రాయిల్‌ పలస్తీనాను ఆక్రమించడం, అమెరికా`నాటో సామ్రాజ్యవాదం మద్దతు ఇవ్వడం వల్ల పలస్తీనా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలందరి బాధలకు మూలకారణం. పలస్తీనా భూబాగం ఆక్రమణ కొనసాగినంత కాలం, సంఘర్షణలు కొనసాగుతాయి, ప్రజలు శాంతియుతంగా జీవించలేరు.
ఈ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసిన కమ్యూనిస్టు యువజనులు తమ అంతర్జాతీయ సంఫీుభావాన్ని తెలియజేయడంతోపాటు గాజా స్ట్రిప్‌లో మారణకాండను ఆపడానికి, ఇజ్రాయిల్‌ పలస్తీనా ఆక్రమణను అంతం చేయడానికి పోరాటాన్ని బలోపేతం చేయాలని అన్ని దేశాలలోని కార్మికులు, ప్రజలు, యువతకు పిలుపునిచ్చారు. పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటానికి తమ ప్రగాఢమైన సంఫీుభావం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img