Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉక్రెయిన్‌ యుద్దం సామ్రాజ్యవాద సృష్టి

కీవ్‌ : ఉక్రెయిన్‌లో జరుగుత్ను సామ్రాజ్యవాద యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్‌ కమ్యూనిస్టు యూనియన్‌ మొదటి బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌ కమ్యూనిసుస్ట్‌ పార్టీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదు. ఉక్రెయిన్‌ కమ్యూనిస్టు పార్టీలపై నిషేధంతోపాటు ప్రస్తుతం అనేక హింసలను ఎదుర్కొంటోంది. ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ (ఎస్‌ఎమ్‌ఓ) కింద ఉక్రెయిన్‌లో చేపట్టిన యుద్ధాన్ని యూనియన్‌ ఆఫ్‌ కమ్యూనిస్ట్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ (యూసీయూ) కమ్యూనిస్ట్‌,వర్కర్స్‌ పార్టీలు తీవ్రంగా ఖండిరచాయి. అమెరికా, నాటో నేతృత్వంలోని దేశాల అంతర్జాతీయ పెట్టుబడిదారీ కూటమి ప్రత్యక్షంగా అ యుద్ధంలో పాల్గొనగా అనేక ప్రధాన పెట్టుబడిదారీ దేశాలు (చైనా, భారత్‌) ఇంకా నేరుగా ప్రవేశించలేదు, ఉక్రేనియన్‌లో ఆర్థిక వనరులను దోచుకోవడంపై అమెరికా, నాటో దేశాల వత్తిడి పెరిగింది, అధిక సంఖ్యలో జనాభా ఆస్తి ఒలిగార్కిక్‌ సమూహాల చేతుల్లోకి వెళ్లిపోయింది.తగినంత తక్కువ ధరలకు రష్యన్‌ ఇంధన వనరులను పొందడం ద్వారా అధిక లాభాలకు పశ్చిమ దేశాల అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులతో లాభాల ఆర్జన లక్ష్యంగా ఉంది. రాజకీయ,ు సైద్ధాంతిక దిక్కుతోచని పరిస్థితుల్లో, కార్మికవర్గం, ట్రేడ్‌ యూనియన్లు, వామపక్ష పార్టీలు వెనుకడుగు వేస్తున్నాయి.2008 ప్రపంచ ఆర్థిక, వాణిజ్యం, పారిశ్రామిక సంక్షోభం దాని పర్యవసానాలు ఉక్రెయిన్‌లో రష్యా, నాటో దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img