Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఆహార కొరతను పరిష్కరించాలని
బ్రిటన్‌లో ప్రదర్శన

బ్రిటన్‌: దేశంలో పెరుగుతున్న ఆహార పేదరికాన్ని పరిష్కరించాలని బ్రిటన్‌ అంతటా వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. జీవన వ్యయ సంక్షోభాన్ని ‘నివారించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. ‘పీపుల్స్‌ అసెంబ్లీ ఎగైనెస్ట్‌ ఆస్టిరిటీ’ అని నినదిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసనలు, కార్యక్రమాలు చేపట్టారు. సూపర్‌ మార్కెట్లు తమ లాభాలను నియంత్రించి ఆహార ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఆహారంపై ధరల నియంత్రణను ప్రవేశపెట్టాలని, దేశవ్యాప్తంగా పిల్లలందరికీ ఉచిత పాఠశాల భోజనం అందించాలని కోరారు.
స్కాట్లాండ్‌లోని కాంప్‌బెల్‌ సిటీ కౌన్సిల్‌ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసనకారులు పెద్ద ఎత్తున నినదించారు. ‘‘ఆహార పేదరికం అన్ని ఇతర రకాల పేదరికం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రత్యక్ష ఫలితం, పట్టణాలు, నగరాల్లో ప్రజల డిమాండ్‌లను తెలియజేయడానికి స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. దేశంలో 4.2 మిలియన్ల మంది పిల్లలు పేదరికంలో మగ్గుతున్నారు. వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిస్థితి భయంకరంగా ఉంది. దేశంలో సంపద అసమానత, పేదరికం తారాస్థాయిలో ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img