Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

చైనా అమరవీరులకు ఘన నివాళి

టియాన్మెన్‌ స్క్వేర్‌ వద్ద జిన్‌పింగ్‌ పుష్పాంజలి

బీజింగ్‌: చైనా అమరవీరులకు అధ్యక్షుడు జిన్‌పింగ్‌, చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు శనివారం ఘనంగా నివాళులర్పించారు. బీజింగ్‌లోని టియాన్మెన్‌స్కేర్‌ వద్ద ఆనవాయితీ ప్రకారం అమరుల దినోత్సవం సందర్భంగా వేడక నిర్వహించారు. అధికార లాంఛనాలతో దేశం కోసం తమ ప్రాణాలను త్యజించిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పదవ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం 10 గంటలకు టాయాన్మెన్‌స్క్వేర్‌ వద్దకు నాయకులు, దేశ ప్రజలు పెద్దఎత్తున చేరుకొని నివాళులర్పించారు. జాతీయ గీతాలపనలో పాల్గొన్నారు. అమరుల కోసం మౌనం పాటించారు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా అభివృద్ధి, చైనా ప్రజలకు విమోచనం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ‘పీపుల్స్‌ హీరోస్‌’ స్మారకం వద్ద తొమ్మిది పెద్ద బుట్టల్లో పుష్పాలతో సీపీఐ కేంద్ర కమిటి తరపున జిన్‌పింగ్‌, ఇతర అగ్రనేతలు కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అన్ని వర్గాల ప్రజలు, అమరుల కుటుంబ సభ్యులు, బంధువులు కూడా రంగురంగుల పూలతో నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img