Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఖుర్‌ఆన్‌ తగలబెట్టడాన్ని ఖండిస్తూ ఐరాస తీర్మానం

అనుకూలంగా ఓటేసిన భారత్‌, చైనాతో సహా 28 దేశాలు
జెనీవా : స్వీడెన్‌లో ఖుర్‌ఆన్‌కు నిప్పుపెట్టడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమతి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీర్మానం చేసింది. దీనికి భారత్‌తో పాటు 28 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ముస్లింల పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేసే విధంగా ఇటీవల చోటుచేసుకున్న ఘటనను అనేక దేశాలు తీవ్రంగా ఖండిరచినాగానీ ఐరాస ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసేందుకు కొన్ని దేశాలు వెనుకాడాయి. తద్వార వాక్‌ స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయి. ‘వివక్ష, శత్రుత్వం లేదా హింసను ప్రేరేపించే మతపరమైన విద్వేషాన్ని నిరోధించడం’ అనే ముసాయిదా తీర్మానాన్ని 47 దేశాలు సభ్యులుగా ఉన్న యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆమోదించింది. దీనికి వ్యతిరేకంగా 12 దేశాలు ఓటు వేయగా మరో ఏడు దేశాలు ఓటింగ్‌కు హాజరు కాలేదు. భారత్‌, పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, అర్జెంటైనా, దక్షిణాఫ్రికా, వియత్నాం, క్యూబా, మలేసియా, మాల్దీవులు, ఉక్రెయిన్‌, యూఏఈ, ఖతార్‌ వంటి దేశాలు తీర్మానానికి మద్దతిచ్చాయి. అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, ఫ్రాన్స్‌, జర్మనీ, బెల్జియం, ఫిన్లాండ్‌, కాస్టరికా, మొంటెనెగ్రో దేశాలు వ్యతిరేకించాయి. గైర్హాజరైన దేశాల్లో బెనిన్‌, చిలీ, మెక్సికో, నేపాల్‌, పరాగ్వే ఉన్నాయి. యూఎన్‌హెచ్‌ఆర్‌సీ హైకమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ మాట్లాడుతూ పవిత్ర ఖుర్‌ఆన్‌ను తగులబెట్టే ఘటనలు ఇటీవల పెరిగాయన్నారు. బక్రీద్‌ రోజున స్వీడెన్‌లోని స్టాకహోమ్‌లో ఖుర్‌ఆన్‌ను తగులబెట్టడంతో ఇస్లామిక్‌ దేశాలు మండిపడ్డాయి. తీవ్రస్థాయిలో ఖండిరచాయి. ఇదే అంశమై చైనా రాయబారి చెన్‌ గ్జు మాట్లాడుతూ ‘ఇస్లామాఫోబియా ఎక్కువైంది. పవిత్ర ఖుర్‌ఆన్‌ను అవమానించే ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. మత స్వేచ్ఛ, మతపరమైన నమ్మకాలు, మనోభావాలను గౌరవిస్తామని చెప్పుకునే దేశాలు వాటిని అమలు చేయడం లేదు’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img