ప్యాంగ్యాంగ్: అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా అణ్వాస్త్రాలతో విన్యాసాలు నిర్వహించింది. ఈ మేరకు కొరియన్ పీపుల్స్ ఆర్మీ జనరల్ స్టాఫ్ (కేపీఏ) ప్రకటన పేర్కొంది. ఆగస్టు 30న తూర్పు, పశ్చిమ సముద్రాల మీదగా గగనతలంలో డీపీఆర్‌కే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా సైన్యంపై బీ1బీ అణు బాంబర్లతో దాడులను అమెరికా సామ్రాజ్యవాదులు చేయించారు. దీనికి ప్రతిఘటనగా కేపీఏ వ్యూహాత్మక అణు డ్రిల్‌ను చేపట్టింది. ప్రధాన కమాండ్ సెంటర్లు, ఆపరేషనల్ ఎయిర్‌ఫీల్డ్స్ వద్ద విన్యాసాలు నిర్వహించింది. ఉత్తర కొరియా విన్యాశాలను జపాన్ తీవ్రంగా ఖండిరచింది. క్షిపణి ప్రయోగాలతో పాటు ఉత్తర కొరియా చేపడుతున్న చర్యలన్నీ తమ దేశ శాంతికి ప్రమాదకరమని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉత్తర కొరియా ఉల్లంగిస్తోందని ఆరోపించింది. ప్రపంచ ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని వెల్లడిరచింది. ఆగస్టు 21
31 తేదీల్లో ‘ఉల్చీ ఫ్రీడమ్ షీల్డ్’ పేరుతో అమెరికా, దక్షిణ కొరియా చేపట్టిన విన్యాశాలలో భాగంగా బుధవారం బీ`1బీ వ్యూహాత్మక బాంబర్ ప్రయోగం జరిగింది.