Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జీ20కి జిన్‌పింగ్‌ రావడంలేదు

బీజింగ్‌: భారత్‌లో వచ్చే వారం జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాల్గొనడం లేదు. ఆ దేశ ప్రధాని లీ కియాంగ్‌ హాజరు కానున్నారు. జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భేటీ ఉండటమే ఇందుకు కారణం కావచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇటీవల బ్రిక్స్‌ సమావేశంలో జిన్‌పింగ్‌ పాల్గొని భారత ప్రధాని మోదీను పలుకరించారు. 2020లో జరిగిన గాల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా, భారత్‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సెప్టెంబరు 9,10 తేదీల్లో భారత రాజధాని న్యూదిల్లీలో జీ20 సమావేశాలు జరగనున్నాయి. కియాంగ్‌… బీజింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని, జిన్‌పింగ్‌ రావడం లేదని వర్గాలు తెలిపాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆయనకు బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ జీ20 సమావేశాల్లో పాల్గోనున్నారు. ఈ మేరకు సందేశాన్ని భారత్‌కు రష్యా పంపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img