Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎస్‌ఓసీ సమావేశానికి జిన్‌పింగ్‌

బీజింగ్‌: రెండేళ్ల తర్వాత తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ విదేశీ పర్యటన చేయనున్నట్లు చైనా సోమవారం అధికారికంగా ప్రకటించింది. షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌లను సందర్శిస్తారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో ఈనెల 15,16 తేదీల్లో జరిగే ఎస్‌సీఓ సమావేశంలో పాల్గొంటారు. సెప్టెంబర్‌ 14న కజకిస్తాన్‌ను సందర్శిస్తారు. ఇది జనవరి 17-18 తర్వాత జిన్‌పింగ్‌ మొదటి విదేశీ పర్యటన. కజకిస్తాన్‌ నుంచి, ఎస్‌సీఓ సమావేశానికి ఉజ్బెకిస్తాన్‌కు వెళతారు. బీజింగ్‌ ప్రధాన కార్యాలయం ఎస్‌సీఓ చైనా, రష్యా, కజకిస్తాన్‌, కిర్గిజాస్తాన్‌, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, భారత్‌, పాకిస్తాన్‌లతో కూడిన ఎనిమిది మంది సభ్యుల ఆర్థిక, భద్రతా కూటమి. ఇరాన్‌ అధికారికంగా ఎస్‌సీఓలోకి ప్రవేశించాలని భావిస్తున్న సమర్‌కండ్‌ శిఖరాగ్ర సమావేశం తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎస్‌సీఓ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై మాస్కో దాడి చేసిన తర్వాత వారి మొదటి పర్యటన ఇదే. సమర్‌కండ్‌లో జరిగే ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పుతిన్‌, జిన్‌పింగ్‌ కలుస్తారని రష్యా అధికారులు ప్రకటించారు. ఈ సదస్సు సందర్భంగా కొన్ని ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా 2020 మాస్కో సమ్మిట్‌ వర్చువల్‌గా జరిగింది. 2021 సమ్మిట్‌ దుషాన్‌బేలో ‘‘హైబ్రిడ్‌ మోడ్‌’’లో నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img