బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆలోచనలను ఆ దేశంలోని ఉన్నత స్థాయి విద్యార్థులకు పాఠాలుగా నేర్పబోతున్నారు. కొత్త యుగానికి చైనా లక్షణాలతో సోషలిజంపై జిన్‌పింగ్ ఆలోచనలను సమగ్ర, వ్యూహాత్మక పద్ధతిలో ఓ పాఠ్యపుస్తకం ప్రచురితమైంది. అదిప్పుడు అందుబాటులోకి వచ్చింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రెస్, పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ సంయుక్తంగా ఈ పాఠ్యపుస్తకాన్ని ముద్రించాయి. చైనా లక్షణాలతో తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాల బోధనకు ఇది ఎంతగానో దోహదమవుతుంది. పుస్తకంలో జిన్‌పింగ్ గురించి విస్తృతంగా వివరించారు. సౖౖెద్ధాంతిక మేధావులు, నిపుణులు… యువ, మధ్య వయస్సుగల టీచర్లతో సమన్వయం చేసుకొని ఈ పాఠ్యపుస్తకాన్ని రూపొందించారు. యువ తరానికి అర్థమయ్యేలా అందులోని అంశాలను తీర్చి దిద్దారు.