Homeఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ కోచ్లుగా జగదీష్, భాస్కర్

ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ కోచ్లుగా జగదీష్, భాస్కర్

- Advertisement -

విశాలాంధ్ర-విజయవాడ స్పోర్ట్స్ : 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలోని ఉత్తమ క్రీడా శిక్షకులు గా (కోచ్)ఎన్టీఆర్ జిల్లా కబడ్డీ కోచ్ కె. జగదీష్, బ్యాడ్మింటన్ కోచ్ భాస్కర్ ఎంపికయ్యారు. ఉత్తమ క్రీడా శిక్షణను పరిగణలోకి తీసుకుని వీరిద్దరిని ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా డిఎస్డివో కోటేశ్వరరావు తెలిపారు. 2009 బ్యాచ్ కి చెందిన జగదీష్ కరీంనగర్, నెల్లూరు, కాకినాడ, విజయవాడ లలో సమర్థవంతమైన శిక్షణ అందించి ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసి రాష్ట్రానికి ఎన్నో పతకాలు అందించాడు. 2017 బ్యాచ్ కి చెందిన భాస్కర్ బ్యాడ్మింటన్ లో తనదైన స్థాయిలో ఎంతమంది క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ టోర్నీలలో రాణించే విధంగా సమర్థవంతమైన క్రీడా శిక్షణను అందించాడు. ఈ సందర్భంగా నగరంలోని మాకినేని బసవపున్నయ్య క్రీడా ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ , ఎంపీ కేసినేని చిన్ని, శాసనసభ్యులు బొండా ఉమా, కలెక్టర్ లక్ష్మీ షా చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కోచ్లు జగదీష్, భాస్కర్ ను పలువురు క్రీడా శిక్షకులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు