- Advertisement -
విశాలాంధ్ర – కడియం : జక్కంపూడి రామ్మోహన్ రావు 15వ వర్ధంతి కడియం మండలంలో ఘనంగా నిర్వహించారు. కడియం మండలం కడియపులంక పంచాయతీ శివారు, దోసలమ్మ కాలనీలో గల మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి కడియం మండలం మాజీ వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈలి గోపాలరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కార్యదర్శి దాసరి శ్రీనివాస్, గాడి శ్రీను, పళ్ళ కుమారస్వామి, చిరుకాడ భాస్కరరావు, ఆకుల జగదీష్, పడాల నరేష్, చెల్లుబోయిన వీరపండు, అంగర చిన్న, ఈలి సుబ్రహ్మణ్యం, సలాది ప్రసాద్ మరియు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


