విశాలాంధ్ర – కూకట్‌పల్లి: కస్టమర్ల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఆభరణాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు. కూకట్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మెగా ముకుందా జ్యువెలర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న డిజైన్లలో ఆభరణాలను అందించడం వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభమైన మెగా ముకుందా జ్యువెలర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముకుంద జ్వెలర్స్ చైర్మన్ బత్తి నర్సింహా రెడ్డీ, డైరెక్టర్ లు నికితరెడ్డి, దాచేపల్లి కృష్ణ, సిబంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
కస్టమర్లకు అనుగుణంగా ఆభరణాలు రూపొందించాలి: మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
RELATED ARTICLES


