Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీయూడబ్ల్యూజే సేవలు అభినందనీయం: సూపర్డెంట్ నాగరాజు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

విశాలాంధ్ర -రాజంపేట: ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన శైలిలో పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించడం హర్షణీయమని రాజంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు అన్నారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి పిలుపుమేరకు అధ్యక్షుడు మెడ పోతుల రామ్మోహన్, ఉపాధ్యక్షులు బి.భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలింతలకు, మెటర్నటీ వార్డుల్లో ఉన్నటువంటి రోగులకు బ్రెడ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అలుపెరగని పోరాటాలను చేస్తుందన్నారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సీనియర్ పాత్రికేయులు కళాంజలి అప్పారావు, త్రివిక్రమ్, శ్రీధర్, సునీల్, అలీ షేర్, కార్తీక్, వెంకటసుబ్బయ్య, మంద శివయ్య, క్షయ వ్యాధి సూపర్వైజర్ జయ ప్రకాష్, ఏఎన్ఎంలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img