రాజంపేటలో అట్టహాసంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
విశాలాంధ్ర -రాజంపేట: జనం మెచ్చిన నేత.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన, కార్మిక, ప్రజలకు సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో జనసేన పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పటి నుండే ఆయన ఆశయాలను ప్రజల్లోకి ప్రతి కార్యకర్త తీసుకువెళ్లాలన్నారు. టిడిపి మరియు వైసిపి ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని, పవన్ కళ్యాణ్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. యుగానికి ఒక పురుషుడు పుడతారని, ఈ యుగంలో పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు పుట్టడం హర్షానీయం అన్నారు. ఇటువంటి జన్మదిన వేడుకలను రోజుల్లో మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్తదానం చేసిన వారికి జనసేన టీ షర్ట్ తో పాటు అప్రిసెట్టివ్ ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కడప లీగల్ సెల్ అధ్యక్షుడు కరుణాకర్ రాజు, ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు,వీర మహిళ రజిత, సుండుపల్లి రెడ్డి రాణి, వీరబల్లె గుగ్గిళ్ళ వెంకటేష్,బండ్ల రాజేష్,పోలిశెట్టి శ్రీనివాసులు, బాల సాయి, శంకరయ్య, మన్నూరు గోపి,భాస్కర్ పంతులు,ఐటి కోఆర్డినేటర్ సాయి శ్రీనివాస్, సిద్ధవటం జనసేన నాయకులు అత్తికారి దినేష్, కళ్యాణ్, రాజేష్, కోలాటం హరి, ప్రశాంత్ భారతాల, వీరయ్య ఆచారి, జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
