Monday, October 3, 2022
Monday, October 3, 2022

ప్రమాదకర స్థాయిలో దేశ రాజకీయాలు

రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్ శక్తులు
గుత్త గా దోచుకుంటున్న జగన్
రాజకీయాల సమూల మార్పునకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ

దేశ రాజకీయాలను కార్పొరేట్ లు శాసిస్తున్నారనీ, కమ్యూనిస్టు లను దూరంగా పెట్టాలని అధికార పార్టీ లను ఆదేసిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలు రూపొందిస్తున్నాయని తెలిపారు. సిపిఐ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభ రెండవ రోజు సోమవారం ఉదయం తిరుపతి లో ప్రారంభం అయింది. ప్రతినిధుల సభల ప్రారంభోత్సవ సూచిక గా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది భాస్కర్ నాయుడు ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి పార్టీ నాయకులు, ప్రతినిదులు నివాళులు అర్పించారు.అనంతరం గండమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో ప్రభాకర్, నదియా, ఉదయ్ అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది. ఇటీవల మృతి చెందిన వారికి చిన్నం పెంచలయ్య సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రతి నిధుల సభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూకార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు ఆర్థిక సంస్కరణలు ఉపయోగ పడ్డాయి అన్నారు. సామాన్యుడి మరింత పేదలు గా మారుతున్నారని అన్నారు.సహజ వనరులు, శ్రమ శక్తి వుండి సరైన విధానాలు రూపొందించక పోవడం తోనే నేటికీ దారిద్రం వెంటాడుతోంది అన్నారు.బి ఎస్ ఎన్ ఎల్ కి 4జి కూడా అనుమతి ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీలకు 5 జి కి అనుమతులు ఇవ్వడం పబ్లిక్ రంగాన్ని ద్వంసం చేయడమే అని మండి పడ్డారు.లాభాల్లో వున్న ఎల్ ఐ సి నీ ప్రైవేట్ పరం చేయడం దారుణం అన్నారు.డ్రగ్ మాఫియా అణచి వేస్తా అంటున్న ప్రధాని అధాని పోర్టు నుండే సరఫరా అవుతుంటే ఎందుకు పట్టుకోలేదనీ ప్రశ్నించారు.ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటున్న మోడీ దామాషా ఎన్నికలు పెట్టేందుకు సిద్దమా అని ప్రశ్నించారు.మూడు రాజదానుల పేరుతో జగన్ మూడు నగరాలను ముంచేసారు అన్నారు. ఎం ఎల్ ఏలు, మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసి జగన్ హోల్ సేల్ గా దోచుకు తింటున్నారని విమర్శించారు.కేంద్రం చేసే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు జగన్, చంద్ర బాబు భయపడుతున్నారని విమర్శించారు.ప్రమాదకర పరిస్థితినీ అధిగమించాలంటే వామ పక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పార్టీకి ఘన చరిత్ర ఉందని, తిరుపతిలో 23 కాలనీలు నిర్మించి 15 వేల మందికి పైగా ఇంటి స్థలాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నాడు తిరుపతిలో రౌడీ మూకలను తరిమికొట్టి ప్రజలకు రక్షణ కల్పించడం జరిగిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు లేనిదే తిరుపతి అభివృద్ధి లేదని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మహా సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య,విశ్వనాథ్, గురవయ్య, పార్థ సారథి, బాలకృష్ణ, సుధాకర్ రెడ్డి, రమణ, కుమార్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి, ఎ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మరెళ్ళ శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, రవి, గుర్రప్ప, సుబ్రమణ్యం, సూరి, గురవయ్య, నాగభూషణం, శివ, లు ఆలపించిన ఉద్యమగేయలు ప్రతినిధులను ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img