Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రం: ఎమ్మెల్యే మేడా

ఆర్డీవో కార్యాలయంలో వేడుకగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -రాజంపేట: దేశ స్వాతంత్ర కోసం సమరయోధులు చేసిన కృషి ప్రశంసనీయమని, వారి అడుగుజాడల్లోనే యువత ముందుకు సాగాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రాజంపేట డివిజన్ కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలో వేడుకగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్డీవో కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి ఎన్సిసి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ ఒంటి మహనీయులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలన్నారు. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలువ మేరకు ఆజాది కా అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విధి నిర్వహణలో అత్యుత్తమ కనపరిచిన ఉద్యోగులకు ఉత్తమ ప్రశంసా పత్రాలను అందజేశారు. అంతకుమునుపు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు వివిధ రకాల వేషధారణలో పాల్గొని దేశభక్తిగీతాలను అలరించారు. వీరితోపాటు మరికొన్ని ప్రవేట్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కోదండరామిరెడ్డి, తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవో శిరీష, వైఎస్ఆర్సిపి నాయకులు యోగేశ్వర్ రెడ్డి, తంబెళ్ల వేణుగోపాల్ రెడ్డి, వడ్డే శ్రీనివాసులు, అన్ని శాఖల ఉద్యోగులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img