Monday, September 26, 2022
Monday, September 26, 2022

సమరయోధుల పోరాట ఫలితమే స్వాతంత్రం: ఎంపీటీసీ మధుబాబు

విశాలాంధ్ర -రాజంపేట: స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే 76వ స్వాతంత్ర దినోత్సవం అని మదన గోపాలపురం, కె బోయినపల్లి ఎంపీటీసీ మధుబాబు అన్నారు. సోమవారం 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చక్రధర్ కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో, సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం సమరయోధులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు విశ్వనాథరాజు, కువైట్ అమ్మ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజర్ పెరుగు ప్రభాకర్ యాదవ్, సర్పంచ్ పెంచలయ్య, జి రవి, వెంకట నరసయ్య, సుబ్బరాయుడు, హెడ్ మాస్టర్లు చంద్రశేఖర్, మార్కండేయ, కార్యదర్శి కరీముల్లా, పెంచలయ్య, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, వాలంటీర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img