Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జగన్ గడ్డపై దద్దరిల్లిన జనసేన నినాదాలు

ప్రజల్లో మార్పు తీసుకురావాలన్నదే నా ఆశయం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

విశాలాంధ్ర -రాజంపేట: ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మార్పు తీసుకురావాలనే ఆశయంతో జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కడప జిల్లా సిద్ధవటం లో కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొని 190 మంది బాధిత కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రజల సమక్షంలోనే ముఖాముఖిగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది బిక్షువుకు అన్నం పెట్టిన చరిత్ర రాయలసీమది అన్నారు. అటువంటి రాయలసీమలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకునే నాయకులే లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎంతోమంది ఎంబీఏలు, డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం దారుణమన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైంది అన్నారు. గ్రామాలలో మద్యం ఏరులై పారుతోందని, దానధర ఎన్నో కుటుంబంలో చిన్నపిన్నం అవుతున్నాయి అన్నారు. ఆడపడుచులపై రోజురోజుకు హత్యాచారాలు ఎక్కువ అయిపోతున్నాయి అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కులాలకు అతీతంగా ప్రజల కోసం పోరాటం చేయాలనే ఆశయంతో జనసేన ప్రజల్లోకి రావడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు జనసేన తోనే సాధ్యమవుతుందన్నారు. అన్ని వర్గాల వారిని సమానంగా అభివృద్ధి చేయాలన్నదే జనసేన ఆశయం అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి రెవెన్యూ వరకు బలోపితం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు జనసేనకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img