Monday, September 26, 2022
Monday, September 26, 2022

మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించిన జర్నలిస్టులు

విశాలాంధ్ర -రాజంపేట: 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు చేసిన కృషి మరువలేనిది అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమం బాగానే జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు భాస్కర్, మలిశెట్టి సుబ్బరాయుడు, సుబ్బ నరసింహులు, రవిచంద్ర, కళాంజలి అప్పారావు, అశోక్ రెడ్డి, రాయలు, అలీ షేర్, కళ్యాణ్, కార్తీక్, కొర్రపాటి నాగరాజు ఆచారి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img