Monday, October 3, 2022
Monday, October 3, 2022

దుస్ప్రచారాలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

రాజంపేట ఎమ్మెల్యే మేడా సవాల్

విశాలాంధ్ర -రాజంపేట: సామాజిక మాధ్యమాలలో తనపై నిందలు వేస్తూ ప్రచారం చేస్తున్న దుస్ప్రచారాలను నిరూపిస్తే శాస్వితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసన సభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం బోయనపల్లె లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వలన సంభవించిన వరదలకు తనను బాధ్యుడిని చేస్తూ విజయవాడలోని టిడిపి ప్రధాన కార్యాలయం వద్ద పోస్టర్లు చూపుతూ మాధ్యమాలలో తనపై నిందలు వేయడం సరికాదని అన్నారు. తాను గాని, తన కుటుంబం సభ్యులు గానీ ఇసుక మాఫియా చేపడుతున్నట్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అవి నిరాధారమైనవని, అక్కడ నిజంగా ప్రభుత్వ భూములు ఉంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలను 98% అమలు చేసిందని.. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి పెళ్లి కానుకను అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైకాపా అందిస్తున్న సంక్షేమము, అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తన పైన, ప్రభుత్వం పైన బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గడపగడపకు వైసిపి కార్యక్రమంలో వైకాపా నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. ఇవన్నీ ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు కొన్ని అసాంఘిక శక్తుల ద్వారా అసత్యపు ప్రచారాలకు పూనుకున్నారని అన్నారు. వైయస్సార్ కుటుంబం ఆది నుంచి ప్రజల పక్షాన, ప్రజల కోసమే ఉందని.. తాను కూడా వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగిందని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు తెలివైన వారని.. ఎవరు ప్రజాసేవకుడో, ఎవరు ఎలాంటి వారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తనపై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై గతంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని., ఇప్పుడు కూడా జిల్లా ఎస్పీ తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడమే కాకుండా వారిపై తగిన చర్యలు తీసుకునేలా., మరోసారి ఇలాంటి చేష్టలకు పాల్పడకుండా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img