Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాజంపేట మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యం

చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి

విశాలాంధ్ర -రాజంపేట: రాజంపేట మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి అన్నారు. బుధవారం విశాలాంధ్రతో మాట్లాడుతూ పట్టణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 29 వార్డుల్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాజంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరడంతో 100 కోట్లు కేటాయించడం జరిగింది అన్నారు. ఈనెల 25న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా మదనపల్లికి రావడం జరుగుతుందన్నారు. ఆరోజున ముఖ్యమంత్రిని కలిసి నిధులు మంజూరు చేసేలా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ప్రధానంగా రాజంపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. దశలవారీగా వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ప్రధాన సమస్యలను గుర్తించి పనులు చేయడం జరుగుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజంపేట మున్సిపాలిటీకి పెద్దపీట వేసి అభివృద్ధి చేయడం జరిగింది అన్నారు. ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే రాజంపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డుల్లో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img