Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటాం: డీఐజీ సెంథిల్ కుమార్

విశాలాంధ్ర -రాజంపేట: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతిష్టాత్మకంగా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికిన అనంతరం రికార్డులను పరిశీలించి సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చే మహిళ పట్ల వ్యవహరించవలసిన శైలి పై సూచనలు అందజేశారు. పోలీసు వ్యవస్థను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తరచూ ఇటువంటి సాధారణ తనిఖీలు చేసి కేసులు సత్వర పరిష్కారం అవుతున్నాయా లేదా పోలీసుల పనితీరుపై సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

నందలూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేస్తున్న కర్నూలు రేంజ్ డీఐజీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img