Friday, October 7, 2022
Friday, October 7, 2022

దేశభాషలందు తెలుగు లెస్స

ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి

విశాలాంధ్ర -రాజంపేట: దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం రమణయ్య, ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో వేడుకగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు మన కళ్ళముందు దర్శనమిస్తారు అన్నారు.వికాసంలో ఎవరెవరు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజంలో మార్పు తేవడానికి.. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో.. అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి అంతే కృషి చేయడం జరిగిందన్నారు.గిడుగు వెంకట రామమూర్తి ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తెలుగు భాష గొప్పదనాన్ని చాటారు. అంతకు మనకు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్ ఇంచార్జ్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, నాగలక్ష్మి, ప్రైమరీ ఇంచార్జ్ కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img