Monday, August 8, 2022
Monday, August 8, 2022

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటానికి సమాయత్తం కావాలి

సిపిఐ మండల మహాసభలో గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటానికి సమాయత్తం కావాలని అని బుధవారం స్థానిక ఒంటిమిట్టలో హరిత రెస్టారెంట్లో జరిగాయి. సిపిఐ మండల కార్యదర్శి కట్టా యానాదయ్య అధ్యక్షత వహించగా, సిపిఐ నాయకులు పి మహేష్ జండా ఆవిష్కరణ చేశారు అనంతరం జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గాలి చంద్ర పి.చంద్రశేఖర్, పి మహేష్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒక సారి శాఖ నుండి జాతీయ స్థాయి వరకూ జరిగే మహసభల్లో సంస్థాగతమైన నిర్మాణాన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాన్ని రూపొందించుకునే క్రమంలో ఆగష్టు 13,14తేదీల్లో ప్రొద్దుటూరులో జిల్లా మహాసభలు, ఆగష్టు 26 నుండి 28 వరకూ రాష్ట్ర మహాసభలు విశాఖపట్ణంలో, అక్టోబర్ 14 నుండి 18 వరకూ జాతీయ మహాసభలు విజయవాడలో జరగనున్నాయి అన్నారు. దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 1925 సంవత్సరంలో ఆవిర్భవించింది. పొత్తిళ్ళనాడే అనేక కుట్ర కేసులను, నిర్భందాలను, నిషేధాలను ఎదుర్కొని భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్రభాగాన నిలిచింది. స్వాతంత్ర్యానంతరం రాజభరణాల రద్దు, బ్యాంక్ జాతీయీకరణ, భూసంస్కరణ చట్టం అమలు కొరకు పట్టుబట్టి వాటిని సాధించింది. ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పేందుకు అనేక పోరాటాలు నిర్వహించింది. దేశ సార్వభౌమాధికారాన్ని, మత సామరస్యతను, లౌకిక వాదాన్ని పరిరక్షించడంలో రాజీలేని పోరాటాలు నిర్వహించింది. దేశంలో కార్మికవర్గాన్ని, రైతాంగాన్ని, యువజన, విద్యార్థులన సంఘటితపరిచి ఆయా వర్గ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం శ్రమిస్తూనే వుంది. భూమి కొరకు, భుక్తికొరకు, పీడిత ప్రజల విముక్తికై వీర తెలంగాణ సాయుధపోరాటం లాంటి ఎన్నో పోరాటాలను నిర్వహించింది. దేశంలో నేడు నెలకొన్న ఫాసిస్ట్ ధోరణుల మీద, ఆర్థిక – సామాజిక అంశాలపై నిరంతరం
పోరాడుతున్నది. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని, సమాచార హక్కుచట్టాన్ని,
ఆహారభద్రతా చట్టాన్ని సాధించడంలో క్రియాశీల పాత్రపోషించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన అత్యంత వెనకబడిన
కడప జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని, ఖనిజ నిక్షేపాలు ఆదారిత
పరిశ్రమలు స్థాపించాలని, పెండింగులో ఉన్న గాలేరు-నగరి, తెలుగుగంగ, కె.సి.
కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన రాజోలి రిజర్వాయర్కు నిధులు,
నికర జలాలు కేటాయించి ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు
అందించాలని, అర్హులైన పేద, మద్యతరగతి ప్రజలకు ఇండ్లు, ఇంటిస్థలం, సాగు
భూమి పంపిణీ చేయాలని, సచివాలయ వ్యవస్థను, రైతు భరోసా కేంద్రాలను
మరింత పటిష్టం చేసి ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చేవిగా సేవలు విస్తరించాలని,
కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ, ఉపాద్యాయ వర్గాల
సమస్యలపైన, సామాజిక అసమానతలు, దాడులపై అనునిత్యం అవిశ్రాంత
పోరాటాలు సిపిఐ నిర్వహిస్తున్నది. ఒంటిమిట్ట చెరువు ఎత్తిపోతల పథకం శాశ్వత మరమ్మత్తులు చేపట్టి
ఆయకట్టుకు నీరందించాలని, సోమశిల వెనక జలాల్లో మునకకు గురవుతున్న
గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని, ఒంటిమిట్ట అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి
కేటాయించి సమగ్రంగా అభివృద్ధి చేయాలని, దేవస్థానంలో అవసరమైనంతమంది
సిబ్బందిని స్థానికులనే నియమించాలని, గాలేరు నగరి రెండో దశ పనులు
ఉద్దిమడుగు రిజర్వాయర్ నిర్మించాలని, ఒంటిమిట్ట చెరువుకు అనుసందానం
చేయాలని, రెండవ భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట మీదుగా వెళ్లే రైళ్లు స్టాపింగ్ కల్పించాలని, దేవస్థానంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, అపరిస్కృతంగా ఉన్న భూమి సమస్యలు పరిష్కరించాలని, పంటల నిలువకోసం ప్రభుత్వ వేర్హౌస్, కోల్డ్ స్టోరేజి నిర్మించాలని పోరాటాలు చేస్తున్నది. ఈ సమస్యలపై మహాసభల వేదికగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కొండమ్మ గంగాదేవి గఫూర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img