Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

అన్ని అర్హతలు ఉన్నా..రైతు భరోసా రావటం లేదు

విశాలాంధ్ర- గూడూరు : పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లువోలు గ్రామంలో అన్ని అర్హతలు ఉన్న కౌలు రైతుని నాకు రావలసిన రైతు భరోసా రావటం లేదు. ఈ సందర్భంగా సోమవారం స్పందన లో అర్జీ ఇవ్వటం జరిగింది. 2021-2022 సంవత్సరానికి సంబంధించి కౌలు రైతు భరోసా డబ్బులు నాకు రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే నీ పేర ఐదు ఎకరాలు పొలం చూపిస్తున్నదని అందుకనే రాలేదని చెప్పినారు. నాకు ఏ పొలం లేదు కదా అని అడిగినాను వేరే వారి పొలం నీ పేర చూపిస్తుందని చెప్పారు. అప్పుడు నేను అర్జీ పెట్టుకోగా నా పేరు ఉన్న పొలాన్ని తొలగించారు. ఈ సంవత్సరం నీకు రైతు భరోసా రాదని, వచ్చే సంవత్సరం వస్తుందని చెప్పినారు మరల ఈ సంవత్సరం అనగా 2022-2023 సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు నాకు రాలేదు మళ్లీ అధికారులను ఎందుకు రాలేదని అడిగితే ఈసారి నా భార్య కు పొలం ఉన్నట్లు చూపిస్తున్నదని అందుకని రాలేదని చెప్పారు ఈ విషయమై 22-10- 2022 న ఆన్లైన్లో కంప్లైంట్‌ చేసినాను(%ఖRI%2022102235) వారు సమాధానం ఇస్తూ వేరే వారి పొలం మీ భార్య పేరున తప్పుగా లింక్‌ అయిందని అందుకని మీకు రైతు భరోసా డబ్బులు రాలేదు అని చెబుతున్నారు. ఇది చాలా అన్యాయం ఎవరో చేసిన తప్పుకి నేను వరసగా రెండు సంవత్సరాలు నేను డబ్బులు నష్టపోయాను కనుక ఈ విషయమై తమరు పూర్తి స్థాయి విచారణ జరిపించి ఇలాంటివి మరల పునరావతం కాకుండా అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని నాకు రావలసిన డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img