Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఆగష్టు 9న సేవ్‌ ఇండియా దినంగా పాటించి నిరసనలు తెలిపాలి

వామపక్షనాయకులు

విశాలాంధ్ర గుడివాడ : ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్‌ ఇండియా దినంగా పాటించి కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమించాలని అభిలపక్షనాయకులు అన్నారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు గూడపాటి ప్రకాష్‌బాబు, సిపిఎం నాయకులు ఆర్‌.సి.పి రెడ్డి, టిడిపి నాయకులు డి.రాంబాబు. కాంగ్రెస్‌ నాయకులు భాగవతుల కోదండపాణి. సిఐటియు పట్టణ కార్యదర్శి తమ్మిశెట్టి లక్ష్మణరావు. ఐద్వా కార్యదర్శి పి.రజిని. సిఐటియు నాయకులు రేపాని కొండ, నారాయణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదిన ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమంలో కార్మికులు రైతులు పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు. నూతనంగా ప్రవేశపెట్టిన నల్ల వ్యవసాయ చట్టాలకు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వెతిరేకంగా నిరసన తెలియజేయాలన్నారు. పంటల గిట్టుబాటు ధరలు కోసం ప్రతేక చట్టం చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు నిధులు పెంచాలని, పెట్రోల,్‌ డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, కౌలు రైతులకోసం రక్షణ చట్టం తేవాలని, కరోనా నియంత్రణకు తోడ్పడుతున్న వర్కర్స్‌కు 50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలలనే డిమాండ్‌తో జరిగే నిరసన కార్యక్రమంలో పాలొని పిలుపు నిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img